Sunday, March 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై విచారణ చేయాలి

రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై విచారణ చేయాలి

- Advertisement -

ప్రభుత్వం బహిరంగంగా దొరికింది
సభ ఏకపక్షంగా పోతోంది : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో

రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం బహిరంగంగా దొరికిపోయిందని ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు. దొంగతనం చేసిన దొంగ మీద విచారణ చేయకుండా, పట్టుకున్న పోలీసుల మీద విచారణ చేసినట్టుదన్నారు. శనివారం అసెంబ్లీలో ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రస్తావించిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ వ్యవహారంపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన కామెంట్స్‌పై మీడియా పాయింట్‌ వద్ద జగదీశ్‌రెడ్డి మాట్లాడారు. సభ ఏకపక్షంగా పోతోందన్నారు. ప్రభుత్వంలో ఉన్న ఓ మంత్రి ఏ రకంగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారో తేలిపోయిందన్నారు. ఆనాడు రేవంత్‌రెడ్డి ఎలాగైతే రూ.50 లక్షలతో బహిరంగంగా దొరికిపోయాడో, అంతకంటే విష్పష్టంగా డాక్యుమెంట్లతో, ఆధారాలతో పొంగులేటి దొరికిపోయారని ఆరోపించారు. హరీశ్‌రావు ప్రస్తావించిన అంశంపై డిఫెండ్‌ చేయలేక మంత్రులంతా అలిసిపోయారని ఎద్దేవా చేశారు.

అడ్డంగా దొరికిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై సీఎం రేవంత్‌ రెడ్డి అందరిపై విచారణ చేయిస్తారా? అని ప్రశ్నించారు. ఎవరో వ్యాపారస్తులు చేస్తే వదిలి పెట్టరు, అలాంటిది మంత్రికి సంబంధించినది ఎలా వదిలేస్తారని ప్రశ్నించారు. నాలుగు లక్షల రూపాయలకే సిట్టింగ్‌ జడ్జి విచారణ అడుగుతారా అని మంత్రులు ప్రశ్నిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వెయ్యి రూపాయలు అవినీతి చేస్తే చర్యలు ఉండవా అని ప్రశ్నించారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థకు అనుమతులు లేవని, ఇదే పెద్ద నేరమని అన్నారు. కంపెనీ పొంగులేటి నాన్న పేరుతో ఉండగా, డైరెక్టర్లు వారి కుటుంబ సభ్యులుగా ఉన్నారని తెలిపారు. అయినా బుకాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదేండ్లపై విచారణ కాదు, 30 ఏండ్ల దానిపై విచారణ చేసినా తమకు నష్టం లేదన్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు గంగుల, హరీశ్‌రావు, కేటీఆర్‌, రవిచంద్రపై ఏ నోటీసులతో అసెంబ్లీలో మాట్లాడారని, సభలో ఇష్టం వచ్చినట్టు బ్లాక్‌మెయిల్‌ చేస్తూ, బుల్డోజ్‌ చేస్తూ నడుపుతున్నారని విమర్శించారు.

కేసీఆర్‌ రూ. 876 రూపాయలు టన్ను ఇసుక ధర పెడితే రూ.730 కోట్ల ఆదాయం వచ్చిందని, ఈ ప్రభుత్వం రూ.1600 రూపాయలు పెట్టింది, దీనిప్రకారం రెండింతల ఆదాయం పెరగాలి కానీ పెరగలేదని, జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. కాళేశ్వరం పంపులు ఆన్‌ చేయకుండా, బ్యారేజ్‌ సేఫ్టీ పక్కన పెట్టి మరీ ఇసుక మాఫియా ఎవరు చేస్తున్నారో కనబడుతోందన్నారు. ప్రభుత్వానికి విచారణ జరిపించే హక్కు ఉందని, అయితే ఆరోపణ చేసిన అంశంపైకాకుండా మాట్లాడిన వారిని బ్లాక్‌మెయిల్‌ చేయడమేంటన్నారు. నేరేళ్ల ఘటన తర్వాత ఎన్నికలు జరిగాయని, అక్కడ కేటీఆర్‌ మెజారిటీ వచ్చిందని చెప్పారు. అయినా ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారని, తమపై ఆరోపణల్లో ఒక్కటి కూడా తేల్చలేకపోయారని విమర్శించారు. బెదిరింపులకు భయపడే ప్రశక్తే లేదన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -