Monday, September 1, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పాలకుర్తిలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను ఏర్పాటు చేయాలి

పాలకుర్తిలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను ఏర్పాటు చేయాలి

- Advertisement -

నవతెలంగాణ – పాలకుర్తి
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి మంజూరు చేసిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను పాలకుర్తి లోనే ఏర్పాటు చేయాలని కోరుతూ బిజెపి మండల అధ్యక్షుడు మారం రవికుమార్ ఆధ్వర్యంలో నాయకులు శనివారం తహసీల్దార్ నాగేశ్వర చారి కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర నాయకులు దొంగరి  మహేందర్ తో కలిసి మాట్లాడుతూ విద్యా రంగంలో పాలకుర్తికి అన్యాయం జరుగుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను పాలకుర్తిలో ఏర్పాటు చేయాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను పాలకుర్తిలో ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో  జిల్లా కార్యదర్శి దుంపల సంపత్, జిల్లా నాయకులు కమ్మగాని శ్రీకాంత్, మండల ప్రధాన కార్యదర్శులు వేల్పుల దేవరాజు, సోమేశ్వర్,పట్టణ అధ్యక్షుడు పబ్బా సంతోష్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad