Thursday, November 13, 2025
E-PAPER
Homeతాజా వార్తలుప్రేమతత్వాన్ని తెలిపే 'అనంత'

ప్రేమతత్వాన్ని తెలిపే ‘అనంత’

- Advertisement -

జగపతి బాబు, సుహాసిని ప్రధాన పాత్రల్లో సురేష్‌ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అనంత’. ఇన్నర్‌ వ్యూ బ్యానర్‌ పై గిరీష్‌ కృష్ణమూర్తి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆడియో, టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో డైరెక్టర్‌ సురేష్‌ కృష్ణ మాట్లాడుతూ,’బాబా ఆశీస్సులతో ఈ సినిమా చేశాను. గత ఏడాది జూన్‌లో ఒక కల వచ్చింది. ఆయన కలలోకి వచ్చి విభూదిని ఇచ్చారు. ఒకరోజు గిరీష్‌ కృష్ణమూర్తి ఫోన్‌ చేసి బాబా జీవితం పై సినిమా చేయాలని చెప్పారు. నేనే ఎందుకు ఈ సినిమా డైరెక్టర్‌ చేయాలని అడిగినప్పుడు.. బాబా కలలోకి వచ్చి మిమ్మల్ని డైరెక్ట్‌ చేయమని చెప్పారు అన్నారు. బాబా శత జయంతి సందర్భంగా ఈ సినిమా చేయాలని కోరారు. అప్పుడు నా దగ్గర స్క్రిప్ట్‌ కూడా లేదు. అనుకోకుండా ఒక మంచి స్క్రిప్ట్‌ వచ్చింది. ఏదో భక్తి సినిమాలా కాదు.

‘బాషా’ సినిమా లాంటి కమర్షియల్‌ స్క్రిప్ట్‌ వచ్చింది. జగపతిబాబుకి సినిమా గురించి చెప్పినప్పుడు ఆయనకు చాలా నచ్చింది. అద్భుతమైన పెర్ఫార్మన్స్‌ ఇచ్చారు. ఆయన డైలాగ్‌ డెలివరీ చూసినప్పుడు సూపర్‌గా అనిపించింది. సుహాసిని చాలా ఇంపార్టెంట్‌ రోల్‌ చేశారు. దేవా అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చారు. శాస్త్రి రాసిన పాట అద్భుతంగా వచ్చింది. కాశీ, చెన్నై, హైదరాబాద్‌, పుట్టపర్తి ఇలా అద్భుతమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ చేశాం. ఇది మామూలు డివైన్‌ లాగా ఉండదు. అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్నాయి. బాబాకి ప్రేమే మతం. కమర్షియల్‌ సినిమాస్‌లో ‘బాషా’ ఎలాంటి ట్రెండ్‌ సెట్‌ చేసిందో డివైన్‌ ఫిలిమ్స్‌లో ‘అనంత’ అలాంటి ట్రెండ్‌ సెట్‌ చేస్తుంది. ఈ సినిమా తర్వాత బాబా ప్రేమ తత్వం మరింత మందికి చేరువవుతుంది’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -