Saturday, September 13, 2025
E-PAPER
Homeసినిమా'అందెల రవమిది' రిలీజ్‌కి రెడీ

‘అందెల రవమిది’ రిలీజ్‌కి రెడీ

- Advertisement -

నాట్యమార్గం ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై శివ బట్టిప్రోలు సమర్పణలో ఇంద్రాణి ధవళూరి నిర్మాతగా, దర్శకురాలిగా తెరకెక్కించిన చిత్రం ‘అందెల రవమిది’. ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత ఇంద్రాణి దవళూరి మాట్లాడుతూ,’ ఇలాంటి ఒక గొప్ప సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తు న్నందుకు చాలా సంతోషంగా ఉంది. తెలుగులో వచ్చిన ఎన్నో అద్భుతమైన సినిమాలు ముఖ్యంగా ‘స్వర్ణకమలం’ సినిమా ఎంతో ప్రత్యేకం. ఆ సినిమా నుంచి ఎంతో స్పూర్తి పొందాను. విశ్వానాథ్‌ సినిమాలు నాకెంతో ఇష్టం. ఈ సినిమా ఇంత బాగా రావడానికి ఎంతో మంది కషి ఉంది. నిర్మాతలు కేఎస్‌ రామారావు, దాము ఈ సినిమాని ప్రొత్సహించడానికి వచ్చినందుకు కృతజ్ఞతలు. అలాగే సినిమా పాటలు ఆదిత్య మ్యూజిక్‌లో ప్లే అవుతున్నాయి. ఆదిత్య మ్యూజిక్‌ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.

‘ఇలాంటి క్లాసికల్‌ టైటిల్‌తో ఈ రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చినందుకు ఇంద్రాణి ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఒక గొప్ప ఆర్ట్‌ సినిమాను తీయడమే కాకుండా ఆమే నిర్మాత, దర్శకురాలు, లీడ్‌ యాక్టర్‌ కావడం అభినందనీయం. ఈ సినిమాలో మ్యూజిక్‌, పాటలు కూడా చాలా బాగున్నాయి. ట్రైలర్‌ చూస్తే, డ్యాన్స్‌ మాత్రమే కాదు నటన కూడా చాలా బాగుంది’ అని నిర్మాత కే.ఎస్‌.రామారావు అన్నారు. ‘నిజమైన ప్యాషన్‌ అంటే ఇదే. చాలామంది ఇండిస్టీకి ఎందుకు వస్తున్నారు అంటే ప్యాషన్‌ అంటారు. కానీ ఇంద్రాణి ప్యాషన్‌ అంటే ఏంటో చూపించారు. ఒక సినిమాని ఆర్ట్‌ ఫామ్‌లో తీయడం ఉంటే మామూలు విషయం కాదు’ అని అని నిర్మాత దామోదర ప్రసాద్‌ చెప్పారు. ఇప్పటి వరకు 11 అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల మనసుల్ని కూడా గెలుచుకుంటుందన్న నమ్మకం ఉంది. ఈనెల 19న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’ అని ఈస్ట్‌ వెస్ట్‌ అధినేత రాజీవ్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -