- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రచయిత అందెశ్రీ కన్నుమూసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన మృతికి కారణాలను గాంధీ ఆస్పత్రి హెచ్‌వోడీ జనరల్ డాక్టర్ సునీల్ కుమార్, డాక్టర్ సింధూర మీడియాకు వెల్లడించారు. అందెశ్రీ హార్ట్‌స్ట్రోక్ కారణంగా మరణించినట్లు తెలపారు. ఆయన గత 15 ఏళ్లుగా అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారన్నారు. గత నెల రోజులుగా ఆయన బీపీ కంట్రోల్‌కు సంబంధించిన మందులు వాడటం లేదని, అనారోగ్యంగా ఉన్నప్పటికీ హాస్పిటల్‌కు వెళ్లలేదని చెప్పారు. ఈ నిర్లక్ష్యమే ఈ విషాదానికి కారణమని వైద్యులు స్పష్టం చేశారు.
- Advertisement -



