నవతెలంగాణ-హైదరాబాద్: రేపు ఘట్కేసర్ సమీపంలోని NFC నగర్‌లో అందెశ్రీ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు అందెశ్రీ పార్దీవ దేహాన్ని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించి నివాళులు అర్పిస్తారు. లాలాపేటలోని GHMC ఇండోర్ స్టేడియంలో ఉంచిన అందెశ్రీ పార్దీవ దేహాన్ని సందర్శించడానికి కుటుంబసభ్యులు, రాజకీయనేతలు, కళాకారులు, రచయితలు తరలివస్తున్నారు.
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ తీవ్ర అస్వస్థతకు గురై ఇంట్లో కుప్పకూలారు. దీంతో ఆయన్ను గాంధీ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. అందెశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు. ‘మాయమైపోతున్నడమ్మా’ గీతంతో మంచి పేరు తెచ్చుకున్నారు. అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రగీతంగా గుర్తించిన విషయం తెలిసిందే.



