నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఇవాళ ఉదయం నగరంలోని గాంధీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. సరిగ్గా ఉదయం 7.25కు ఆయన మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. ఈ సందర్భంగా ఆయన పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు లాలాపేటలోని అందెశ్రీ నివాసానికి తరలిస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం వరకు డెడ్‌బాడీని అక్కడే ఉంచి ప్రజల సందర్శనార్థం జయశంకర్ స్టేడియానికు తరలించనున్నారు. ఈ క్రమంలోనే అందెశ్రీకి కడసారి నివాళులర్పించేందుకు పలువురు ప్రముఖులు లాలాపేటలోని ఆయన నివాసానికి తండోపతండాలుగా వెళ్తున్నారు. ఇప్పటికే అందెశ్రీ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి, సీఎస్ రామకృష్ణారావును ఆదేశించారు. దీంతో ఘట్‌కేసర్‌లో అందెశ్రీ అంతిమ సంస్కారాలు జరగనున్నట్లుగా తెలుస్తోంది.
లాలాపేట నివాసానికి అందెశ్రీ పార్థివ దేహం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



