Monday, November 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందూరుతో అందెశ్రీ ఆత్మబంధం

ఇందూరుతో అందెశ్రీ ఆత్మబంధం

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
డాక్టర్ అందెశ్రీ కి నిజాంబాద్ తో ఎంతో అనుబంధం ఉందని తన రెండో జన్మభూమిగా నిజాంబాద్ ను ఆయన భావించేవాడని తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘనపురం దేవేందర్ అన్నారు. ఇందూరుతో అందెశ్రీది ఆత్మబంధం అని ఆయన వ్యాఖ్యానించారు. పొట్టబోసుకునే క్రమంలో ఈ మట్టితో అనుబంధం కలిగిన అందెశ్రీ బాసర సరస్వతి దేవి ఆశీస్సులతో సహజ కవిగా ఎదిగిన ప్రతిభా మూర్తి డాక్టర్ అందెశ్రీ అని ఆయన నివాళులర్పించారు. ఉద్యమ కాలంలో ఆయన నిజామాబాదును అనేకమార్లు సందర్శించాలని పేర్కొన్నారు. 2011లో హరిదా రచయితల సంఘం లోగో ఆవిష్కరణ సభలో పాల్గొన్నారని ఆయన వివరించారు. పోచంపాడు బాసర కందకుర్తి ల వద్ద ఆయన గోదావరి ప్రయాణం చేస్తూ ఆశువుగా పాటలు అల్లాడని వివరించారు. జిల్లాలో సాంస్కృతిక ఉద్యమానికి ఆయన రాక ఎంతో బలాన్ని ఇచ్చిందని జిల్లాకు ఆయన మార్గదర్శి అని పేర్కొన్నారు.

అందెశ్రీ మరణంతో బాసర చదువులమ్మ పుత్రశోక అనుభవిస్తుందని, తెలంగాణ తల్లి కూడా ఆవేదన చెందుతుందని ఆయన అన్నారు. వాక్కులమ్మని బాసర సరస్వతిని మనసారా పిలిచే డాక్టర్ అందె శ్రీ ఆ అమ్మకరుణతోనే తాను సాహిత్యంలో రాణించానని అనేకసార్లు చెప్పారని గుర్తు చేసుకున్నారు. లాల్ గూడా లోని మున్సిపల్ స్టేడియంలో అందెశ్రీ పార్థివదేహానికి ఘనపురం దేవేందర్ నివాళులర్పించారు. నిజామాబాద్కు చెందిన నరాల సుధాకర్గో, శిక నరసింహస్వామి, గుత్ప్ప ప్రసాద్, డాక్టర్ బలాష్ట్ మల్లేశ్ , అంబట్ల రవి, కత్తి గంగాధర్, సాంబయ్య డాక్టర్ కంటియాల  ప్రసాద్, సిహెచ్ మధు, అనిశెట్టి శంకర్,  తుర్లపాటి లక్ష్మి,  కాసర్ల నరేష్, ఆనంద్ మేకల్ వార్, తిరుమల శ్రీనివాస్సు ఆర్రేయ, సురేశ్ తంగళ్ళపల్లి తదిరులతో గొప్ప అనుబంధం ఉందని ఆయన తెలిపారు. ప్రస్తుత శాసనసభ్యులు నాటి ఉద్యమకారులు ధన్పాల్ సూర్యనారాయణ తోని వారికి ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -