నవతెలంగాణ – పెద్దవంగర
అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారం, ఆరోగ్య సంబంధిత సదుపాయాలను గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు సద్వినియోగం చేసుకోవాలని మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల సీడీపీఓ విజయలక్ష్మి సూచించారు. ఆమె సోమవారం బొమ్మకల్లు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలను సూపర్‌వైజర్ శోభతో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పిల్లల ఆరోగ్య పరిస్థితి, గర్భిణుల ఎదుగుదల తదితర అంశాలను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించి, ఆహార సరఫరా, వృద్ధి ప్రమాణాల నిర్వహణపై సిబ్బందికి సూచనలు చేశారు. చిన్నపిల్లలు, గర్భిణులు, బాలింతలు శారీరకంగా బలంగా ఎదగాలంటే వారిని కేంద్రాల సేవలతో నిత్య సంబంధంలో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు రంగు అంభిక, యాదమ్మ, కవిత, గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు పాల్గొన్నారు.
అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి: సీడీపీఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES