Wednesday, July 16, 2025
E-PAPER
Homeజిల్లాలుఫేస్ యాప్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న అంగన్వాడీలు: సీఐటీయూ

ఫేస్ యాప్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న అంగన్వాడీలు: సీఐటీయూ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ : అంగన్వాడి కేంద్రాల నిర్వహణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు యాప్ లను నిర్వహిస్తున్నాయి. వాటిలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ హెచ్ టీఎస్ యాప్ ను, కేంద్ర ప్రభుత్వం పోషణ్ ట్రాకర్ యాప్ లను అంగన్వాడి కేంద్రాలలో నిర్వహిస్తున్నారు. ఎన్ హెచ్ టి హెచ్ యాప్ ను కొనసాగించి, పోషణ్ ట్రాకర్ యాప్ ను తొలగించాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. పోషణ్ ట్రాకర్ యాప్ నిర్వహణ అంగన్వాడీలకు తలకు మించిన భారమైనదని, ఈ యాప్ ఒకసారి ఓపెన్ అయితే ఒకసారి ఓపెన్ కాదని తెలిపారు. దీనికోసం గంటల తరబడి సమయం వెచ్చించాల్సొస్తుందని అన్నారు.

యాప్ ఒక్కోసారి ఓపెన్ అవుతుంది.. ఒక్కోసారి కాదు. ఒకవేళ అయినా ఎంతసేపు ఉంటుందో అర్థంకాదు.
ఈ యాప్ నిర్వహణ భారంతో అంగన్వాడి టీచర్లకు బీపీలు., షుగర్లు, వచ్చి అనారోగ్య పాలు అయ్యే ప్రమాదం ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ యాప్ ను రద్దు చేయాలని సురేష్ గొండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఈ సందర్బంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అంగన్వాడి కేంద్రాల నిర్వహణకు ఒక యాప్ ఉంటే సరిపోతుందని, అది కూడా ఎన్ హెచ్ టి ఎస్, యాప్ ను కొనసాగించి వారి ఇబ్బందులను తీర్చాలని తెలిపారు.

పోషణ్ ట్రాకర్ యాప్ లో పేస్ క్యాప్చర్ అయితేనే ఫుడ్ ఇవ్వాల్సి వస్తుందని, ఈ పేస్ క్యాప్చర్ వలన అలబ్ధిదారులు కూడా ఇబ్బందులు పడవలసి వస్తుందని అన్నారు. ఒక నెల అయితే ఒక నెల కావటం లేదని, ఏ డిపార్ట్మెంట్లో లేని విధంగా ఐసిడిఎస్ లో పేస్ క్యాప్చర్ విధానాన్ని ప్రవేశపెట్టడం మంచి పద్ధతి కాదని ఆయన అన్నారు. నెలకు రూ.1 లక్ష జీతం తీసుకుంటున్న వాళ్లు కూడా ఈ ఇబ్బందులు, టెన్షన్లు పడటం లేదని ఆవేదన చెందారు. వీరి పని భారాన్ని తగ్గించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలపై ఉందని ఆయన అన్నారు. అంగన్వాడి టీచర్లకు నెలకు రూ.13,600 వేతనం ఇస్తూ.. 24. గంటలు పని చేయిస్తున్నారని మండిపడ్డారు. మహిళలని కూడా చూడకుండా వారిపై ఇంత పనిభారం పెంచడం న్యాయం కాదని అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -