- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఫెమా కేసులో రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ మరోసారి ఈడీ విచారణకు హాజరు కాలేదు. నవంబర్ 14న హాజరు కావాల్సి ఉండగా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతానని అభ్యర్థించారు. ఈడీ తిరస్కరించడంతో, సోమవారం రెండోసారి సమన్లు జారీ చేసినా ఆయన హాజరు కాలేదు. బ్యాంకును మోసం చేసిన మనీలాండరింగ్ కేసులో ఈడీ సమన్లు జారీ చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.2,929 కోట్ల రుణం తీసుకున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
- Advertisement -



