- Advertisement -
న్యూఢిల్లీ : బ్యాంక్‌లను మోసం చేసిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణను ఎదుర్కొంటున్న రిలయన్స్ గ్రూప్ చైర్మెన్ అనిల్ అంబానీ రెండోసారి విచారణకు గైర్హాజరయ్యారు. నిధుల మళ్లింపు, మనీలాండరింగ్ కేసులో నవంబర్ 14న ఇడి ముందు ఆయన హాజరు కావాల్సి ఉంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతానని ఈడీని కోరారు. కాగా దీనిని ఈడీ అధికారులు తిరస్కరించారు. దీంతో అనిల్ అంబానీకి మరోసారి సమన్లు జారీ చేస్తారా? లేదా? అనే విషయం అధికారులు వెల్లడించలేదు. పలు బ్యాంక్‌లను దాదాపు రూ.17వేల కోట్లకు అనిల్ అంబానీ ముంచిన విషయం తెలిసిందే. ఈ నిధులను ఆయన అక్రమంగా మళ్ళించారు.
- Advertisement -



