నవతెలంగాణ-హైదరాబాద్: నార్కెట్ పల్లి మండలం జువ్విగూడెం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి చింత అనిల్ కుమార్ ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుంది. శుక్రవారం పార్టీ శ్రేణులతో కలిసి గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. గ్రామాభివృద్ది కోసం సర్పంచ్ గా ఎన్నికల బరిలో నిలిచిన తనకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను చింత అనిల్ కుమార్ కోరారు. ఈనెల 11న పొలింగ్ సందర్భంగా ఉంగరం, గౌను గుర్తుకు ఓటు వేసి, సర్పంచ్‌గా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన చింత అనిల్ కుమార్..ఉన్నత విద్యను అభ్యసించారు. ప్రముఖ కాలేజ్ లో బి.టెక్ పట్టాను అందుకున్నారు. ఉన్నత చదువుల తర్వాత పలుమార్లు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించారు. ఆ తర్వాత ప్రయివేటుగా టీచర్‌గా విధులు నిర్వహించారు. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూ పేదలకు చేయూత అందించారు. లోకల్ బాడీ ఎన్నికల్లో భాగంగా అధికార పక్షమైన కాంగ్రెస్ పార్టీ తరుపున జువ్విగూడెం సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నత విద్యవంతుడైన చింత అనిల్ కుమార్ పోటీ చేస్తున్నారు. యువతీయువకులతో పాటు గ్రామస్తులంతా తనకు మద్దతుగా నిలువాలని, ఉంగరం, గౌను గుర్తులకు ఓట వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని చింత అనిల్ కుమార్ ఓటర్లను కోరారు.







