– నల్ల ముఖాలకు చదువెందుకు
– జంగిల్ నుంచి వచ్చారు టీసీ ఇచ్చి పంపండి
– మెదక్ గురుకుల పాఠశాలలో దారుణం
– కిడ్నీ స్టోన్ వస్తె స్కూల్ కు రావద్దని ఆదేశం
నవతెలంగాణ -మెదక్ ప్రాంతీయ ప్రతినిధి : నల్లగా ఉన్న విద్యార్థిపై గురుకుల పాఠశాలలో ఏ ఎన్ ఎం అవమానపరిచే వాక్యాలు చేసింది. కిడ్నీ స్టోన్ తో ఇంటికి వెళ్ళిన విద్యార్థిని గురుకుల పాఠశాలలోకి అనుమతి ఇవ్వడానికి అడ్డు చెప్పడమే కాకుండా జంగిల్ నుంచి వచ్చిన వారిని ఎందుక తీసుకుంటారో టిసి ఇచ్చి పంపాలని విద్యార్థినితో పాటు తల్లిదండ్రులపై చేసిన వ్యాఖ్యల పై ఆ విద్యార్థి తల్లిదండ్రులు అవమానకరంగా వెనుతిరిగి మీడియాని ఆశ్రయించిన ఘటన మెదక్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ లో జరిగింది. బాధితులు జిల్లా కలెక్టర్ గురువారం ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కొల్చారం మండలం నాయిని జలాల్ పూర్ కు చెందిన ఎల్లం, జ్యోతి ల కుమార్తె మనస్విని మెదక్ లోని తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ లో ఏడవ తరగతి చదువుతుంది. ఫిబ్రవరి 20న కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. స్కూల్ కు వెళ్ళిన తల్లిదండ్రులు విద్యార్థిని మనస్రిని ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యం చేయించారు. స్వల్పంగా కిడ్నీ స్టోన్ ఉంది నీళ్ళు తాగితే సరిపోతుందని వైద్యులు చెప్పడం తో మళ్ళీ స్కూల్ కు వెళ్ళారు. కానీ కిడ్నీ లో స్టోన్ పూర్తిగా తగ్గాకే రావాలని చెప్పారు. దీనితో స్కూల్ ల్లో చేర్పించి వెళ్లిపోగా మళ్ళీ అస్వస్థకి గురి కావడంతో తల్లిండ్రులు వచ్చారు. అదే స్కూల్ లో ఉన్న ఏ ఎం ఎమ్ ను నొప్పి పై ఆరా తీస్తే తిక్క తిక్కగా సమాధానం చెప్పినట్లు తల్లిదండ్రులు చెప్పారు. జంగిల్ నుంచే వచ్చే వారిని స్కూల్లో ఎందుకు చేర్చుకుంటారని తల్లిదండ్రులు ముందే అనడంతో తీవ్ర అవమానంగా భావించారు. టీసీ ఇచ్చి పంపేయాలని చెప్పడం వివాదంగా మారింది. విద్యార్థితో పాటు తల్లిండ్రులు నల్లగా ఉండడం వల్లనే ఏ ఎన్ ఎం వాఖ్యలు చేసినట్టు చెబుతున్నారు. అయినా స్కూల్లో చేర్చుకోవాలని బ్రతిమిలాడినా కిడ్నీ లో స్టోన్ లు తగ్గినట్టు డాక్టర్ సర్టిఫికెట్ తీసుకు వస్తేనే జాయిన్ చేసుకుంటామని ప్రిన్సిపాల్ తో పాటు సిబ్బంది చెప్పినట్టు విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థి నల్లగా ఉండడం మూలంగా స్కూల్ లో చేర్చుకోకుండా ఇలా అవమానకరంగా మాట్లాడినట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ ఎన్ ఎం తో పాటు స్కూల్ లో చేరుకోకుండా అడ్డుకున్న వాటిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ విషయం పై ప్రిన్సిపల్ తారా సింగ్ మాట్లాడుతూ అలా మాట్లాడం తప్పేనని, విచారణ చేసి చర్యలు తీసుకుంటారని చెప్పారు.



