Saturday, August 2, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ఘనంగా అన్నాభావు సాఠె 105వ జయంతి వేడుకలు

ఘనంగా అన్నాభావు సాఠె 105వ జయంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – బజార్ హాత్నూర్
మండలంలోని భోసారా గ్రామంలో డా సాహిత్య సామ్రాట్ అన్నాభావు సాఠె 105వ జయంతి వేడుకలను గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా గ్రామంలోని చిన్న పెద్ద తేడాలేకుండా అన్నాభావు సాఠె చిత్రపటానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు. మాంగ్ సమాజ్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు గాడేకర్  పరశురామ్ మాంగ్ మాట్లాడుతూ అన్నాభావు సాఠె మార్గంలో అందరు నడవాలని, అలాగే తహశీల్దార్ కార్యాలయం ద్వారా మాంగ్ కులానికి వెంటనే కుల ధ్రువీకరణ పత్రం జారీచేయాలని, వెనుకబడిన మాంగ్ సమాజ్ అభివృద్ధికి ప్రత్యేక మాంగ్ సమాజ్ కార్పొరేషన్ ఏర్పాటుచేయాలని, పిల్లలు చదువుకోవడానికి గురుకులాల్లో ప్రత్యేక సీట్లు కేటాయించాలనీ, ఏజెన్సీలో నివసించే మాంగ్ ప్రజలకు పాత పహాణి పత్రాల ఆధారంగా రైతులకు లభించే అన్ని సదుపాయాలు కల్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సొంటకే గజానంద్, గ్రామస్తులు సూర్యకాంథ్, ప్రభాస్, బాలాజీ, కృష్ణ, గజానంద్, సంజీవ్, రమేష్, రవి, నాందేవ్, విష్ణు, సదాశివ, శంకర్, మల్లారి, కృష్ణ, రాజు, బండు, రవీందర్, తుకారాం, బ్రహ్మనంద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -