Wednesday, December 3, 2025
E-PAPER
Homeసినిమాయాక్షన్‌ కామెడీతో 'అన్నగారు వస్తారు'

యాక్షన్‌ కామెడీతో ‘అన్నగారు వస్తారు’

- Advertisement -

హీరో కార్తి నటిస్తున్న కొత్త సినిమా ‘వా వాతియార్‌’. తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘అన్నగారు వస్తారు’ టైటిల్‌తో రాబోతోంది. బుధవారం ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్‌ చేశారు.
ఈ సినిమాను ఈ నెల 12న వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌ చేస్తున్నట్లు మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌లో కె.ఇ. జ్ఞానవేల్‌ రాజా దీన్ని నిర్మిస్తున్నారు. యాక్షన్‌ కామెడీ కథతో దర్శకుడు నలన్‌ కుమారస్వామి రూపొందిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. బుధవారం రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఈ చిత్రం నుంచి ‘అన్నగారు’ లిరికల్‌ సాంగ్‌ రిలీజ్‌ చేశారు.

ఈ సాంగ్‌ను సంతోష్‌ నారాయణన్‌ చాట్‌ బస్టర్‌ ట్యూన్‌తో కంపోజ్‌ చేయగా, రాకేందు మౌళి క్యాచీ లిరిక్స్‌ అందించారు. ఎస్‌.పి.అభిషేక్‌, హరిప్రియ ఎనర్జిటిక్‌గా పాడారు. ‘అన్నగారు, అన్నగారు..ఆల్రెడీ నే రిచ్‌ కిడ్డు, పాన్‌ ఇండియా మూవీ ప్లాన్‌ చేశా, రాజమౌళికి ఫోన్‌ చేసి నా మీద బయోపిక్‌ ఒకటి తీయమంటున్న..’ అంటూ కలర్‌ఫుల్‌ మేకింగ్‌తో ఆకట్టుకుంటోందీ పాట. రీసెంట్‌గా డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి రిలీజ్‌ చేసిన ఈ సినిమా టీజర్‌కు హ్యూజ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ప్రమోషనల్‌ కంటెంట్‌కు వస్తున్న రెస్పాన్స్‌ చూస్తుంటే ఈ సినిమా హీరో కార్తి కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్‌ అవుతుందనే ఎక్స్‌ పెక్టేషన్స్‌ ఏర్పడుతున్నాయి అని చిత్ర బృందం తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -