- Advertisement -
నవతెలంగాణ-డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని 2021 బ్యాచ్ బి. ఎడ్, బి. పి. ఎడ్ ఒకటవ,రెండవ, మూడవ, నాలుగవ, ఐదవ, ఆరవ సెమిస్టర్ రెగ్యులర్/బ్యాక్లాగ్ థియరీ పరీక్షల ఫలితాల పునర్మూల్యాంకనం కొరకు దరఖాస్తు పత్రాలను 03-11-2025 వరకు సమర్పించాలని కంట్రోలర్ ప్రొఫెసర్ డాక్టర్ కే సంపత్ కుమార్ తెలిపారు. పునర్ మూల్యాంకనం ఫీజు ఒక్కొక్క పేపర్ కి రూ. 500 పాటుగా25 రూపాయలు చెల్లించి దరఖాస్తు పత్రాలను పొందాలని పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ కె.సంపత్ కుమార్ తెలిపారు. పూర్తి వివరాలు తెలంగాణ వర్సిటీ వెబ్సైట్లో పొందుపరచడం జరిగిందన్నారు.
- Advertisement -



