భేష్ నెల్లికుదురు పోలీస్ స్టేషన్
శభాష్ ఎస్ఐ రమేష్ బాబు
మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్
నవతెలంగాణ నెల్లికుదురు
వార్షిక తనిఖీల్లో భాగంగా నెల్లికుదురు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసినట్టు మహబూబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, తెలిపారు. శుక్రవారం నెల్లికుదురు పోలీసు స్టేషన్ కు చేరుకున్న ఎస్పీ రామ్ నాథ్ కేక న్ కి పోలీస్ అధికారుల గౌరవ వందనాన్ని పలికారు. ఈ సందర్భంగా అనంతరం అక్కడ విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది యొక్క ప్రభుత్వ కిట్ ఆర్టికల్స్‌ను తనిఖీ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో పర్యావరణ పరిరక్షణలో భాగంలో ఎస్పీ స్వయంగా మొక్కను నాటారు. పోలీస్ స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాలను, సీజ్ చేసిన వాహనాలను, రిసెప్షన్ రికార్డ్, రైటర్ రూమ్ పరిశీలించారు. పనిచేసే పరిసర ప్రాంతాలు పోలీస్ స్టేషన్ ఆవరణ శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు.
నెల్లికుదురు పిఎస్ లో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ ప్రారంభించారు. వినాయక చవితి వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని, శాంతిభద్రతల విషయంలో ఎటువంటి సమస్యలు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఎస్పీ సిబ్బందిని ఆదేశించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలన్నారు. గ్రామాలకు సంబంధించిన విపిఓలు రెండు మూడు రోజులకు ఒకసారి గ్రామాలను సందర్శించి అక్కడ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవాలని సూచించారు.
గణేష్ మండపాల నిర్వాహకులు, స్థానిక ప్రజలు, కమిటీల సహకారంతో నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు.గ్రామాలలో ప్రజలతో స్నేహపూర్వకమైన సంబంధాలు కొనసాగించాలని, పోలీస్ స్టేషన్ వివిధ కేసులలో ఉన్న వాహనాల యొక్క అడ్రస్ తెలుసుకుని సంబంధిత యజమానులకు త్వరగా అప్పగించాలని సంబంధిత ఎస్ఐ లను ఆదేశించారు.బ్లూ కోల్డ్స్, పెట్రో కార్ విధులు నిర్వహించే సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, సీసీ టీఎన్ఎస్ ఆన్ లైన్ డాటా ఏరోజుకారోజు అప్డేట్ చేసుకోవాలని సూచించారు.
ఫిర్యాదులతో మర్యాదగా మాట్లాడి సాధ్యమైనంత త్వరగా వారి సమస్యలు పరిష్కరించాలని, జూదం, పిడిఎస్ రైస్, అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కేసులు నమోదు చేయాలన్నారు.విజబుల్ పోలీసింగ్ పై దృష్టి సారించాలని ఉదయం సాయంత్రం విసేబుల్ పోలీసింగ్ విధులు నిర్వహించాలని, అధికారులకు సిబ్బందికి సూచించారు. పాత నేరస్తులైన కేడీలు డీసీలు సస్పెక్ట్ లను తరచుగా తనిఖీలు చేయాలని సూచించారు. పాత నేరస్తులపై నిఘా ఉంచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ క్రిష్ణ కిషోర్ , డిసిఆర్బి సీఐ సత్యనారాయణ , సీఐ టీ.గణేష్ , ఎస్ఐ సిహెచ్. రమేష్ బాబు, పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.