Monday, September 1, 2025
E-PAPER
spot_img
Homeకరీంనగర్కాళేశ్వరం జలాలతో అమరవీరుల స్తూపానికి జలాభిషేకం

కాళేశ్వరం జలాలతో అమరవీరుల స్తూపానికి జలాభిషేకం

- Advertisement -
  • – కాళేశ్వరం తెలంగాణకు అన్నపూర్ణ
    – కక్షపూరిత రాజకీయాలను మానుకోవాలి

    – మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు 
    నవతెలంగాణ – కరీంనగర్ : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, కక్షపూరిత రాజకీయాలను మానుకోవాలని మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశాల ప్రకారం, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బిఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ శ్రేణులు లోయర్ మానేరు నది నుండి కాళేశ్వరం జలాలను సేకరించారు. అనంతరం, వారు కరీంనగర్‌లోని అమరవీరుల స్తూపం వద్దకు చేరుకొని ఆ జలాలతో అమరవీరుల స్తూపానికి జలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు “జై కేసీఆర్, జై జై కేసీఆర్” అంటూ నినాదాలు చేశారు.

కాళేశ్వరం తెలంగాణకు అన్నపూర్ణ: నారదాసు లక్ష్మణరావు

ఈ సందర్భంగా నారదాసు లక్ష్మణరావు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజలకు, రైతాంగానికి ఒక వరం, అన్నపూర్ణ వంటిదని పేర్కొన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కె.సి.ఆర్. పేరును అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కేవలం రెండు పిల్లర్లలో పగుళ్లు వచ్చినా, వాటిని మరమ్మతులు చేపట్టకుండా వివిధ కమిటీల పేరుతో విచారణకు ఆదేశించి ప్రాజెక్టును అపవిత్రం చేశారని విమర్శించారు.

ఈ చర్యల వల్ల తెలంగాణ అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని, వారి ఆత్మలు శాంతించాలని కోరుతూ అమరవీరుల స్తూపానికి కాళేశ్వరం జలాలతో జలాభిషేకం చేశామని వారు తెలిపారు. భవిష్యత్తులో కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి రైతాంగానికి నీళ్లు అందిస్తామని నారదాసు లక్ష్మణరావు హామీ ఇచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలను ఆపి, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పిల్లి శ్రీలత – మహేష్ గౌడ్, కొత్తపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాసారపు శ్రీనివాస్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు, నగర బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad