- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమాన సర్వీసుల రద్దు వరుసగా ఐదో రోజు కూడా కొనసాగుతోంది. ఇప్పటి వరకు హైదరాబాద్‌కు రావాల్సిన 38 విమానాలు, హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన 39 విమానాలు రద్దు అయ్యాయి. దీంతో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దు సంఖ్య 500కు చేరింది. మరోవైపు ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు కాస్తున్నారు. తమకు ప్రత్యామ్నాయ సర్వీసులను ఏర్పాటు చేయాలని ఇండిగో సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. ముంబైలో 112, ఢిల్లీలో 109, బెంగళూరులో 124 విమానాల రద్దుతో పోల్చితే హైదరాబాద్‌లో ఈ సంఖ్య తక్కువగా ఉండటం విశేషం.
- Advertisement -



