Friday, January 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఏసీబీకి చిక్కిన మరో జిల్లా అధికారి

ఏసీబీకి చిక్కిన మరో జిల్లా అధికారి

- Advertisement -

రూ.50 వేలు లంచం తీసుకున్న పౌరసరఫరాల శాఖ మేనేజర్‌ జగన్మోహన్‌

నవతెలంగాణ- వనపర్తి
వనపర్తి జిల్లాలో మరో అధికారి ఏసీబీకి పట్టుబడ్డారు. జిల్లా కేంద్రంలో ఉన్న సమీకృత జిల్లా అధికారుల భవన సముదాయంలోని పౌర సరఫరాల శాఖ జిల్లా కార్యాలయంలో పౌరసరఫరాల సంస్థ మేనేజర్‌ కుంభ జగన్మోహన్‌ రూ.50,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఘటనకు సంబంధించి మహబూబ్‌నగర్‌ ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ఓ రైస్‌ మిల్లు ఓనర్‌కు సీఎంఆర్‌ ధాన్యం కేటాయింపుల్లో భాగంగా అనుమతులు కోరుతూ పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ జగన్మోహన్‌ను సంప్రదించారు.

అందుకు రూ.1,75,000 లంచం డిమాండ్‌ చేశారు. అందులో భాగంగా గురువారం సాయంత్రం పొద్దుపోయాక ఐడిఓసిలోని పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో రూ.50,000 అడ్వాన్స్‌గా లంచం తీసుకుంటుండగా జగన్మోహన్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. విచారణ అనంతరం నాంపల్లి కోర్టులో హాజరు పరుచనున్నారు. ఏ ప్రభుత్వ అధికారులైనా లంచాలు డిమాండ్‌ చేసినా.. తీసుకున్న ఏసీబీకి సమాచారం అందజేయాలని డీఎస్పీ సూచించారు. టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1064 లేదా సోషల్‌ మీడియా ద్వారా సమాచారం అందించాలని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -