Thursday, March 26, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంమ‌రో ఇరాన్ కీల‌క నేత మృతి

మ‌రో ఇరాన్ కీల‌క నేత మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఓవైపు ట్రంప్ ప‌శ్చిమాసియా యుద్ధానికి ఐదు రోజుల బ్రేక్ ప్ర‌క‌టిస్తే..ఇజ్రాయిల్ మాత్రం ఇరాన్‌పై దాడిలు కొన‌సాగిస్తుంది. ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన కీల‌క నేత మ‌ర‌ణించాడు. ఆదేశ ఎలైట్ నావెల్ ఫోర్స్ (నావికా దళం) చీఫ్‌ అలీరెజా తాంగ్సిరి మరణించాడు. తాము జరిపిన వైమానిక దాడుల్లో అతడు ప్రాణాలు కోల్పోయినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. ఇరాన్ నావికా దళానికి నాయకత్వం వహిస్తున్న టాప్ కమాండర్‌ అలీరెజాను పోర్ట్ సిటీ అయిన బందాకం అబ్బాస్‌ వద్ద హతమార్చినట్లు ప్రకటించింది.

2018 నుంచి అలీరెజా నావికాదళానికి నేతృత్వం వహిస్తున్నాడు. ఆయనను సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ నియమించాడు. ఇరాన్ నావికా దళ సామర్ధ్యం పెంచడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. దేశంలో తొలి డ్రోన్ క్యారియర్ నౌకను ఆవిష్కరించాడు. తమకు ఎదురొస్తే నరకాన్ని చూపిస్తామని శతృవులను హెచ్చరించాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -