- కవిత వర్సెస్ జగదీశ్వర్ రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్: బీఆర్ఎస్‌లో మరో ముసలం నెలకొంది. మొన్నటిదాక కేసీఆర్ కవితా మధ్య కోల్డ్ వార్ నడవగా…తాజాగా జగదీశ్ రెడ్డి వర్సెస్ కవితాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని సర్వ నాశనం చేసిందే ఈ లిల్లీపుట్. ఆయన తన గురించి మాట్లాడుతారా అంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.
కవిత వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా స్పందించిన జగదీశ్ రెడ్డి.. ‘నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితమ్మకు ఉన్న జ్ఞానానికి నా జోహార్లు… కేసీఆర్ శత్రువులైన రేవంత్, రాధాకృష్ణలు నా గురించి మాట్లాడిన మాటల్ని మరొక్కసారి వల్లే వేసేందుకు ఆమె చేసిన ప్రయత్నానికి నా సానుభూతిని తెలియజేస్తున్న’ అంటూ ట్వీట్ చేశారు.
ఇప్పటికే పార్టీ అధిష్టానం తీరుపై తీవ్ర అసహనంతో ఉన్న కవిత సొంత ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు. ఈక్రమంలో గులాబీ పార్టీలో ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయి. ఈ పరిణామాలపై కేసీఆర్ ఏ విధంగా సమన్యయం చేస్తారో అని ఆ పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో, ఎంపీ ఎలక్షన్స్ ల్లో ఘోరో ఓటమి చవిచూసింది బీఆర్ఎస్. రానున్న స్థానిక సంస్థల్లో ఈ తరహా పార్టీలోని లుకలుకలు మరో పరాభవానికి దారీ తీస్తాయని రాజకీయ విశ్లేషకులు చెప్పుతున్నారు.