Wednesday, November 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యే మదన్ మోహన్ ను కలిసిన మరో ఎమ్మెల్యే తోట

ఎమ్మెల్యే మదన్ మోహన్ ను కలిసిన మరో ఎమ్మెల్యే తోట

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ను హైదరాబాద్ లోని వారి నివాసంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, కామారెడ్డి డీసీసీ నూతన అధ్యక్షులు ఏలే మల్లికార్జున్  మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ, సమిష్టిగా కష్టపడి పనిచేయాలని, పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే మదన్ మోహన్  మల్లికార్జున్  కు సూచించారు. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నింపుతూ, వ్యూహాత్మాకంగా ముందుకు వెళ్తూ పార్టీకి  విజయాలు అందించాలని అన్నారు. ఇందులో తన సంపూర్ణ సహకారం ఉంటుందని ఎమ్మెల్యే మదన్ మోహన్ తెలిపారు. ఈ భేటీలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నాయకులు భుజంగారి భాస్కర్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయి పటేల్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -