Saturday, October 18, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమామునూరు ఎయిర్‌పోర్టుకు మరో రూ. 90 కోట్లు విడుదల

మామునూరు ఎయిర్‌పోర్టుకు మరో రూ. 90 కోట్లు విడుదల

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : వరంగల్‍లోని మామునూరు ఎయిర్‌పోర్టు అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ. 90 కోట్లు విడుదల చేసింది. భూసేకరణకు అవసరమైన పరిహారం కోసం ఈ నిధులు కేటాయించారు. గతంలో రూ.205 కోట్లు చెల్లించగా ఎకరానికి రూ.1.20 కోట్ల చొప్పున పరిహారం పెంచడంతో అదనపు వ్యయం పెరిగింది. సీఎం రేవంత్‍రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిధులను విడుదల చేశారు. దీంతో భూసేకరణ ప్రక్రియ వేగవంతం కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -