నవతెలంగాణ హైదరాబాద్: బీఆర్ఎస్‌కు మరో షాక్. ఆ పార్టీ కీలక నేత, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, పార్టీకి రాజీనామా చేశారు. సోమవారం రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు పంపించారు. రాజీనామాకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తోన్న సమయంలో బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ వ్యతిరేక రాగం పాడుతుండటం, ఫోన్ ట్యాపింగ్ కేసులో, కాళేశ్వరం విషయంలో ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తుండటం గులాబీ నేతలను కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా గువ్వల బాలరాజు, అబ్రహం, మర్రి జనార్దన్ రెడ్డి రాజీనామా చేయడం ఆ పార్టీ శ్రేణులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది.