Friday, December 19, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో సిట్‌

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో సిట్‌

- Advertisement -

సీపీ సజ్జనార్‌ ఆధ్వర్యంలో ఐదుగురు ఐపీఎస్‌లు

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్‌ఐబీ మాజీ ఐజీ ప్రభాకర్‌రావు కస్టోడియల్‌ విచారణ గడువు గురువారంతో ముగిసింది. గత ఏడ్రోజులుగా జూబ్లీహిల్స్‌లోని ఏసీపీ కార్యాలయంలో ప్రభాకర్‌రావును సిట్‌ అధికారులు విచారించారు. ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలో సాగిన ఈ విచారణలో ప్రభాకర్‌రావు నుంచి సాధ్యమైనంత వరకు ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారంలో నిజాలను బయటకు లాగడానికి దర్యాప్తు అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. ఏసీపీ కార్యాలయంలోనే ఏర్పాటు చేసిన ప్రత్యేక గదిలో నిందితుడికి బస ఏర్పాటు చేసి మరీ విచారించారు. ఈ ఏడ్రోజులు భోజనంతో పాటు ఆయన ఆరోగ్యానికి అవసరమైన ఔషధాలను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇంటి నుంచే తెప్పించారు. విచారణ సమయంలో నిందితుడి తరఫు న్యాయవాది కూడా ఆయన సమక్షంలోనే ఉన్నారు. మొత్తమ్మీద తన ఆదేశాల మేరకో లేదా తన పైసీనియర్‌ అధికారుల ఆదేశాల మేరకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఫోన్‌ట్యాపింగ్‌ జరిగిన మాట నిజమేనని ప్రభాకర్‌రావు అంగీకరించినట్టు దర్యాప్తు వర్గాల నుంచి తెలిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -