Saturday, October 25, 2025
E-PAPER
Homeజాతీయంబెంగళూరులో మరో విషాదం..

బెంగళూరులో మరో విషాదం..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరులో రోడ్ల దుస్థితి మరో నిండు ప్రాణాన్ని బలిగొంది. రోడ్డుపై ఉన్న ఓ గుంతను తప్పించే ప్రయత్నంలో 26 ఏళ్ల ప్రియాంక బైక్‌పై నుంచి కిందపడి, వెనుక నుంచి వచ్చిన ట్రక్కు కింద నలిగి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషాద ఘటన నగరంలోని నెలమంగళ సమీపంలో చోటుచేసుకుంది. ప్రియాంక తన సోదరుడితో కలిసి బైక్‌పై ప్రయాణిస్తోంది. మార్గం మధ్యలో రోడ్డు అధ్వానంగా ఉండటంతో ఓ గుంతను తప్పించేందుకు ఆమె సోదరుడు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బైక్ అదుపుతప్పి ఇద్దరూ కిందపడిపోయారు. హెల్మెట్ ధరించి ఉండటంతో ఆమె సోదరుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కానీ, ప్రియాంక రోడ్డుకు అవతలి వైపు పడటంతో, అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న ఓ ట్రక్కు ఆమె పైనుంచి దూసుకెళ్లింది. దీంతో ఆమె తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -