Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుభారత అమ్ములపొదిలోకి మరో యుద్ధనౌక

భారత అమ్ములపొదిలోకి మరో యుద్ధనౌక

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: భారత నౌకాదళం మరింత బలోపేతం అవుతోంది. భారత నావికాదళంలో కొత్త యుద్ధనౌక ‘అర్నాల’ చేరింది. యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ సిరీస్ మొదటి యుద్ధనౌక INS అర్నాల.జూన్ 18న విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో INS ఆర్నాలను భారత నౌకాదళంలోకి అధికారికంగా ప్రవేశపెట్టనున్నారు.ఈ కమిషన్ కు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ అధ్యక్షత వహిస్తారు. INS ఆర్నాల భారత నావికాదళంలో స్వదేశీంగా నిర్మించిన ముఖ్యమైన యాంటీ-సబ్ మెరైన్ వార్ ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. ఇది భారత నౌకాదళం రక్షణ సామర్థ్యాలను గణనీయంగా పెంచుతుంది. ముఖ్యంగా తీరప్రాంత జలాల్లో శత్రు జలాంతర్గాముల బెదిరింపులను ఎదుర్కొవడంలో ఇది సాయపడుతుంది. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img