నామినేషల్ దాఖలు చేసిన మాజీ క్రీడామంత్రి
న్యూఢిల్లీ : భారత క్రీడాశాఖ మంత్రి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ మరోసారి క్రీడల్లోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బిఎఫ్‌ఐ) ఈ నెల 21న జరగబోయే వార్షిక సర్వ సభ్య సమావేశంలో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోనుంది. హిమాచల్ ప్రదేశ్ బాక్సింగ్ కమిటీ తరఫున ఏజీఎంకు హాజరు కానున్న అనురాగ్ ఠాకూర్.. భారత బాక్సింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా నామినేషల్ దాఖలు చేశారు. సోమవారంతో నామినేషన్లకు గడువు ముగియగా.. ఏజీఎంకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాస్తవానికి ఈ ఏడాది మార్చి 28న బాక్సింగ్ సమాఖ్య ఎన్నికలు జరగాల్సి ఉండగా.. పలు కారణాలతో వాయిదా పడ్డాయి. మార్చి 28న జరగాల్సిన ఎన్నికల్లోనూ అనురాగ్ ఠాకూర్ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయగా.. రాష్ట్ర సంఘంలో ఎన్నికైన సభ్యుడి కాదని అతడి పేరును ఎలక్ట్రోరల్ కాలేజ్ నుంచి తొలగించారు. అప్పటి రిటర్నింగ్ అధికారి జస్టిస్ (విశ్రాంత) ఆర్.కె గౌబ ఆ నిర్ణయాన్ని ఆమోదించారు. ప్రపంచ నూతన బాక్సింగ్ సమాఖ్య ‘వరల్డ్ బాక్సింగ్’ మార్గదర్శకాల ప్రకారం తాతాల్కిక కమిటీ ఇటీవల నూతన రాజ్యాంగం తీసుకొచ్చింది. కొత్త రూల్స్ ప్రకారం ఎన్నికలు జరుగనున్నాయి. గతంలో రిటర్నింగ్ అధికారికగా పని చేసిన జస్టిస్ ఆర్ కె గౌబ తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని బాధ్యతల నుంచి తప్పుకున్నారు. 2020-2024 బిఎఫ్‌ఐ ఎన్నికలు నిర్వహించిన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి రాజేశ్ టండన్ ఈసారి రిటర్నింగ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం లోక్‌సభ సభ్యుడిగా కొనసాగుతున్న అనురాగ్ ఠాకూర్ అభ్యర్థిత్వాన్ని రిటర్నింగ్ ఆఫీసర్ ఆమోదిస్తారా? లేదా? అనేది ఉత్కంఠగా ఉంది.
బాక్సింగ్ ప్రెసిడెంట్ రేసులో అనురాగ్ ఠాకూర్
- Advertisement -
- Advertisement -