నవతెలంగాణ-హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, ఫోన్ ట్యాపింగ్ లో ఉన్న ఎవరైనా జైలుకు వెళ్లక తప్పదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్ల వద్దే కోట్లు దొరుకుతున్నాయంటే… ఆ సమయంలో అధికారంలో ఉన్న కేసీఆర్, హరీశ్ రావు వద్ద ఎన్ని కోట్లు ఉంటాయో ఊహించవచ్చని అన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోందని… కేబినెట్ సమావేశం తర్వాత అన్ని విషయాలను వెల్లడిస్తారని చెప్పారు.
సీఎం రేవంత్ గురించి మాట్లాడుతూ… రేవంత్ జూనియర్ అయినప్పటికీ సీనియర్లను గౌరవిస్తున్నారని కోమటిరెడ్డి కితాబునిచ్చారు. పార్టీలో అందరూ ఒక టీమ్ లా పనిచేస్తున్నామని చెప్పారు. బనకచర్ల ప్రాజెక్ట్ ను కట్టనివ్వబోమని, శ్రీశైలం ప్రాజెక్ట్ ను కాపాడతామని తెలిపారు. నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సాగునీటి ప్రాజెక్టులపై తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యవహారం గురించి ప్రశ్నించగా… ఆమె ఎవరో తనకు తెలియదని అన్నారు.