Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఐక్యతతో ఉంటే దేనినైనా సాధించవచ్చు: ఎమ్మెల్యే కడియం

ఐక్యతతో ఉంటే దేనినైనా సాధించవచ్చు: ఎమ్మెల్యే కడియం

- Advertisement -


నవతెలంగాణ – ధర్మసాగర్

ఏ వర్గమైనా ఏ కులమైన కలిసి ఉంటే దేనినైనా సాధించవచ్చు అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం రెడ్డి రైతు పరపతి సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా భవన నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు ఇరువురు మాట్లాడుతూ రెడ్డి రైతు పరపతి సంఘం భవన నిర్మాణాన్ని రెండు, మూడు అంతస్తులలో మహిళలకు, కుల సంఘానికి, రైతులకు ఉపయోగపడే విధంగా నిర్మాణం చేయాలని సూచించారు.భవన నిర్మాణానికి 10లక్షలు మంజూరు చేస్తున్నాని, త్వరలోనే మరో 10లక్షలు మంజూరు ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ధర్మసాగర్ రెడ్దిలకు మంచి గుర్తింపు ఉందని అన్నారు. రెడ్డి సంఘంలో రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నా కుల సంఘంగా అందరూ ఒక్కటిగా ఉండడం మంచి శుభ పరిణామం అన్నారు. 6నెలలో భవన నిర్మాణం పూర్తి చెసి ప్రారంభోత్సవం చేసుకోవాలని తెలిపారు. గడిచిన ఏడాది కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి 800 కోట్ల నిధులు తీసుకువచ్చానని, మార్చి 16న సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారని తెలిపారు. రానున్న రోజులలో మరిన్ని నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ది చేసుకుందామని, దానికి మీ అందరి సహకారం ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ రాజిరెడ్డి, రైతు సంఘం అధ్యక్షులు రాంచంద్రారెడ్డి, జయపాల్ రెడ్డి, రెడ్డి సంఘం నాయకులు రావుల వెంకటరెడ్డి, నిమ్మ సుదర్శన్ రెడ్డి, చాలా పుష్ప మాల,రెడ్డి కులస్తులు, స్థానిక ప్రజా ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad