నవతెలంగాణ – మద్నూర్
మండల రైతులు రైతు బీమా ఇప్పటివరకు చేసుకొని వారు, కొత్తగా పట్టా అనగా 2025 జూన్ 5వ తేదీ వరకు పట్టా పాస్ బుక్ ఉన్న రైతులు 18 నుంచి 59 సం” ఆదార్ కార్డ్ లో 1966 ఆగస్టు 14 తేదీ, 2007 ఆగస్టు 14 వ తేదీ మధ్య పుట్టిన రైతులు రైతు బీమా పథకమునకు అర్హులు. చివరి తేదీ 13-8-2025 సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉందని మండల వ్యవసాయ అధికారి రాజు తెలియజేశారు.
కావున మండల రైతులు ఈనెల 13 సాయంత్రం వరకు ఆయా గ్రామాల ఏఈవో వద్ద స్వయంగా రైతు వెళ్ళి రైతు బీమా దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి రాజు మండల రైతులకు విజ్ఞప్తి చేశారు.
గమనిక: ఇంతకు ముందు బీమా చేసుకున్న రైతులు మళ్ళీ చేసుకోవలసిన అవసరం లేదు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఏఈవో సౌమ్య , రైతులు పాల్గొన్నారు.