- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: సోషల్ మీడియా వాడకం పై కర్నాటక ప్రభుత్వ తరహాలోనే ఆంధ్రప్రదేశ్ కీలక నిర్ణయం తీసుకోనుంది. కర్నాటకలో 16లోపు మైనర్లకు సోషల్ మీడియా వాడకంపై పూర్తిగా నిషేధం విధించారు. తాజాగా ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ అంశాన్ని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. ఏపీలో 13 ఏండ్లలోపు మైనర్లకు సోషల్ మీడియా వాడకం నిషేధం విధించనున్నట్లు సభలో తెలిపారు.ఈ ప్రక్రియకు 90 రోజుల్లో విధివిధానాలు తెలియజేస్తామన్నారు. సోషల్ మీడియా అధికంగా మైనర్లను ప్రభావితం చేస్తోందని, దీని కారణంగా మైనర్లు మంచి కన్నా చెడు వైపు అధికంగా ప్రభావితమవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
- Advertisement -



