Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంతెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పాలి

తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పాలి

- Advertisement -

– ఆత్మగౌరవాన్ని పెంచాల్సిందిపోయి ఆత్మాభిమాన్ని తాకట్టు పెట్టడం దారుణం : కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

తెలంగాణ ఆత్మగౌరవాన్ని, ఆడబిడ్డల ఆత్మాభిమాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం తాకట్టు పెట్టిందనీ, ఈ విషయంలో తెలంగాణ ఆడబిడ్డలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రపంచ అందాల పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన విదేశీ వనితల కాళ్లను తెలంగాణ ఆడపడుచులతో కడిగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచదేశాల ముందు తెలంగాణ ఆత్మగౌరవాన్ని పెంచాల్సింది పోయి.. వారి ముందు మన ఆత్మాభిమానాన్ని తాకటు ్టపెట్టేలా వ్యవహరిం చడాన్ని తప్పుబట్టారు. మహిళా సాధికారతకు, మహిళల ధైర్యసాహసాలకు ప్రతీక అయిన రాణి రుద్రమదేవి ఏలిన గడ్డపై, సమక్క సారక్క పోరు గడ్డపై చారిత్రక రామప్ప ఆలయ ప్రాంగణంలో తెలంగాణ మహిళలను అవమానించడం దురదృష్ట కరమని పేర్కొన్నారు.
భారతీయు లను విదేశీయుల ముందు మోకరిల్లేలా చేయడమే కాంగ్రెస్‌ చరిత్ర అని విమర్శించారు. సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలతో పాటుగా రేవంత్‌ రెడ్డి.. భారతీయ, తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img