Friday, March 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమూడో డిస్కం లైసెన్స్‌కు దరఖాస్తు

మూడో డిస్కం లైసెన్స్‌కు దరఖాస్తు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో కార్యకలాపాలను ప్రారంభించేందుకు అవసరమైన పంపిణీ లైసెన్స్‌ కోసం కొత్తగా ఏర్పాటైన మూడో డిస్కం ‘తెలంగాణ రైతు పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌’ (టీజీఆర్‌పీడీఎల్‌) దరఖాస్తు చేసింది. సంస్థ సీఎండీ ముషారఫ్‌ ఫరూఖీ గురువారం తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ) కార్యదర్శి రామచందర్‌కు దరఖాస్తు సమర్పించారు. కాగా మార్చి 18న కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ) నుంచి కొత్త డిస్కం ఏర్పాటుకు ఆమోదం లభించించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో టీజీఆర్‌పీడీఎల్‌ అధికారులు ఎ.అనిల్‌ కుమార్‌, జె. లక్ష్మణ్‌, శ్రావణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -