Saturday, August 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం..

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం..

- Advertisement -

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
సూర్యాపేట జిల్లా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో ప్రవేశాలకు బాల బాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఎస్ సి వెల్ఫేర్ అధికారి కే. దయానంద రాణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ వెల్ఫేర్ కార్యాలయo యందు దరఖాస్తు పారాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 8 వరకు గడువు ఉoదని తెలిపారు.01.06.2018 నుంచి 31.05.2019 మధ్య జన్మించిన విద్యార్థులు అర్హులని తెలిపారు. దరఖాస్తుదారులు కుల ఆదాయ నివాస ధ్రువీకరణ పత్రలు పాస్ ఫోటోలు జత చేసి ఎస్ సి వెల్ఫేర్ కార్యాలయంలో అందజేయాలని తెలిపారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఈనెల 11న లాటరీ పద్ధతిలో ఉంటుందని తెలిపారు.ఇతర వివరాల కోసం ఫోన్ నెంబర్ 6309765141 కి  సంప్రదించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -