మండల విద్యాశాఖాధికారి బుధారపు శ్రీనివాస్
నవతెలంగాణ – పెద్దవంగర : మండలంలోని కేజీబీవీ పాఠశాలలో ఖాళీగా ఉన్న గెస్ట్ టీచర్ కోసం అర్హులైన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని మండల విద్యాశాఖాధికారి బుధారపు శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేజీబీవీ లో ఇంగ్లీష్ సీఆర్టీ పోస్టు, పాఠశాలలో భోదించుటకు ఖాళీగా ఉందని తెలిపారు. ఈ పోస్టు కోసం ఎంపికైన వారు ప్రస్తుత విద్యా సంవత్సరానికి 2025-26 కు మాత్రమే పని చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గ్రాడ్యుయేషన్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఇంగ్లీష్, బీఈడీ, టెట్ అర్హత కలిగిన అభ్యర్థులు చిన్నవంగర కేజీబీవీ లో ఈనెల 25, సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులు సమర్పించాలని కోరారు.
గెస్ట్ టీచర్ పోస్టు కోసం దరఖాస్తుల ఆహ్వానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES