నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ విద్యానగర్ లో ఉన్న ఈ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి 4 గెస్ట్ లెక్చరర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు గడువు విధించారు. బీబీఏ, బీసీఏ కంప్యూటర్ అప్లికేెషన్స్, బీఏ- పీపీజీ (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్), హిస్టరీలో మొత్తం 4 పోస్టులున్నాయి. పీజీలో 55 శాతం మార్కులతో పాటు పీహెచ్ డీ, నెట్, సెట్, స్లెట్ ఉన్న వారికి ప్రథమ ప్రాధాన్యతనిస్తారు. ఆసక్తి కలిగిన వారు కళాశాల మెయిల్ కు ఆన్ లైన్ ద్వారా లేదా కళాశాల కార్యాలయంలో నేరుగా దరఖాస్తులను సమర్పించవచ్చు. మరింత సమాచారం కోసం 99510 82830లో కళాశాల ప్రిన్సిపాల్ ను సంప్రదించవచ్చు.
వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులకు ఆహ్వానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES