Sunday, September 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వ్యవసాయ యాంత్రీకరణపై దరఖాస్తుల స్వీకరణ…

వ్యవసాయ యాంత్రీకరణపై దరఖాస్తుల స్వీకరణ…

- Advertisement -

– వ్యవసాయ అధికారి  రాంబాబు
నవ తెలంగాణ -ఆర్మూర్  : రైతుల కోసం వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రాయితీపై పరికరాల దరఖాస్తుల స్వీకరణ  ప్రారంభమైందని ఆలూరు వ్యవసాయ అధికారి రాంబాబు  సోమవారం  తెలిపారు. జిల్లాకు మొత్తం 6,742 యూనిట్లు కేటాయించగా, మొదటి విడతగా రూ.1.67 కోట్లు మంజూరైనట్లు తెలిపారు.
ఈ పథకం కింద 11 రకాల వ్యవసాయ పరికరాలకు సబ్సిడీ వర్తించనుందని చెప్పారు. ఐదు ఎకరాల లోపు భూమి కలిగిన ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులు మరియు మహిళా రైతులకు 50 శాతం సబ్సిడీ, పెద్ద రైతులకు 40 శాతం సబ్సిడీ   లభించనుంది. దరఖాస్తు చేసుకునే సమయంలో రైతులు పట్టాపాస్‌బుక్, ఆధార్ జిరాక్స్ సమర్పించాల్సి ఉంటుంది.గతంలో లబ్ధి పొందని రైతులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని తెలిపారు. ఈ పథకం కింద బ్యాటరీ స్ప్రేయర్లు, పవర్ స్ప్రేయర్లు, రోటావేటర్లు, సీడ్ డ్రిల్లులు, నాగాండ్లు, గడ్డి కటర్లు, పవర్ టిల్లర్లు, వితనాలు నాటే యంత్రాలు, గడి కట్టలు చేసే పరికరాలు అందుబాటులో ఉంటాయి అని ఎంపికైన లబ్ధిదారులు పరికరాలు సరఫరా చేసే కంపెనీ పేరుతో డీడీ తీసుకురావాలని  వ్యవసాయాధికారి  సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -