- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ముస్లింలు పవిత్రంగా భావించే హజ్ యాత్ర 2026కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైందని కేంద్రం ప్రకటించింది. ఈ నెల 31 వరకు అప్లికేషన్లు స్వీకరించనుంది. ఇంటర్నేషనల్ పాస్ పోర్టును కలిగి ఉండటం తప్పనిసరని పేర్కొంది. యాత్రికులు hajcommittee.gov.in 3 HAJ SUVIDHA మొబైల్ యాప్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. మరణం, ఎమర్జెన్సీ మినహాయించి యాత్రను క్యాన్సిల్ చేసుకుంటే జరిమానా తప్పదని స్పష్టం చేసింది.
- Advertisement -