Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్అనాధ బాలికలకు పాలిటెక్నిక్ డిప్లమా కోర్స్లో ప్రవేశాల కొరకు దరఖాస్తుల ఆహ్వానం

అనాధ బాలికలకు పాలిటెక్నిక్ డిప్లమా కోర్స్లో ప్రవేశాల కొరకు దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
అనాధ, పాక్షిక అనాధ, నిరుపేద, తల్లిదండ్రుల నిర్లక్ష్యానికి గురైన, అక్రమ రవాణాకు గురైన బాధిత బాలికల కొరకు ఎటువంటి అర్హత పరీక్ష లేకుండా నేరుగా 2025 -26 సంవత్సరంనకు హైదరాబాదులోని దుర్గాబాయి దేశముఖ్ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో  అడ్మిషన్లకై దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి కె నరసింహారావు తెలిపారు. 2024- 25 విద్యా సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసిన ఆసక్తిగల బాలికలు తల్లిదండ్రుల మరణ ధ్రువీకరణ పత్రం తోపాటు కులం ధ్రువీకరణ, ఆదాయ ధ్రువీకరణ, స్టడీ సర్టిఫికెట్, బోనఫైడ్ సర్టిఫికెట్  తో రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలతో ఈనెల 24వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరింత సమాచారం కొరకు భువనగిరి జిల్లా లోని  బాల రక్షా భవన్, మహిళా శిశు సంక్షేమ శాఖ, ఓల్డ్ మున్సిపల్ కాంప్లెక్స్, ఓల్డ్ బస్టాండ్,  సెల్ ఫోన్ నెంబర్లు 9573727033, 9701182 198 లకు సంప్రదించాలని కోరారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad