Thursday, September 18, 2025
E-PAPER
Homeజిల్లాలునవోదయలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

నవోదయలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -

9, 11వ తరగతుల్లో చేరేందుకు గొప్ప అవకాశం
నవతెలంగాణ – నిజాంసాగర్

మండల కేంద్రంలోని పి యం శ్రీ జవహార్ నవోదయ విద్యాలయం లో 2026-27 విద్యా సంవత్సరనికి 9, 11వ తరగతుల్లో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రాంబాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2025- 26 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల్లో 8వ తరగతి, పదవ తరగతి చదివేవారు అర్హులని ఆయన తెలిపారు.

పదో తరగతి చదువుతున్న, నివాసం ఉంటున్న జిల్లా ఒకటే అయినప్పుడు విద్యార్థి జిల్లాస్థాయి మెరిట్ కోసం పరిగణిస్తారని తెలిపారు. గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో 8వ తరగతి విద్యార్థి ఓపెన్, గ్రామీణ కోటా కింద పరిగణిస్తారని, పట్టణ ప్రాంత పాఠశాలల్లో విద్యార్థి అర్బన్ కోటా కింద పరిగణిస్తారని తెలిపారు.ఈ నెల 23లోగా దరఖాస్తు చేసుకోవాలని, 2026 ఫిబ్రవరి 7న ప్రవేశపరీక్ష నిర్వహిస్తారని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గల విద్యార్థులు https://www.navodaya.gov.in ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -