Thursday, November 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళలకు ఉచిత శిక్షణాకు దరఖాస్తుల ఆహ్వానం ..

మహిళలకు ఉచిత శిక్షణాకు దరఖాస్తుల ఆహ్వానం ..

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి
స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డిచ్ పల్లి వారి ఆధ్వర్యంలో నవంబర్ 18 నుండి  ప్రారంభం అయ్యే శిక్షణలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ రవికుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. టైలర్ శిక్షణా 31 రోజులు (18 నవంబర్ నుండి), మగ్గం  వర్క్ 31 రోజులు( 19 నవంబర్ నుండి), బ్యూటీ పార్లర్  35 రోజులు(20 నవంబర్ నుండి ) ప్రారంభం కానున్నాయి. ఈఉచిత శిక్షణ తో పాటుగా ఉచిత భోజన సదుపాయం, హాస్టల్ వసతి ఉంటుందని పేర్కొన్నారు.  శిక్షణా అనంతరం ధ్రువీకరణ పత్రం అందించబడు తుందని, శిక్షణకు కావాల్సిన అర్హతలు  19 నుండి 45 సంవత్సరాల వయసు కలిగి ఉండి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన  గ్రామీణ ప్రాంత యువతులు అర్హులన్నారు.

ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ రవి కుమార్ తెలిపారు. ఆసక్తి గల వారు తమవేంట ఆధార్ కార్డ్ , రేషన్ కార్డ్, 10వ తరగతి ధ్రువీకరణ పత్రం, ఐదు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు, బ్యాంక్ ఖాతా  ఇవన్నీ జిరాక్స్ కాపిలను తెచ్చుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవలని సూచించారు. ఏదైనా సమాచారం కోసం ఎస్‌బి‌ఐ శిక్షణా కేంద్రం వెలుగు ఆఫీసు ప్రక్కన ఘన్పూర్ రోడ్ డిచ్ పల్లి లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు  వచ్చి నమోదు చేసుకోవలన్నారు. వివరాలకు 08461- 295428 ఫోన్ నంబర్ లలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -