- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్ : 6,7,8 తరగతుల్లో మిగిలిన ఖాళీల సీట్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని – ఉమ్మడి నిజామాబాదు జిల్లా కన్వీనర్ నీరడి గంగాశంకర్, మద్నూరు గురుకుల విద్యాలయం జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నందాల గంగా కిశోర్ లు తెలిపారు. 6,7,8వ తరగతుల్లో మిగిలి ఉన్న సీట్లకోసం మద్నూరులోని తెలంగాణ గురుకుల విద్యాలయం, జూనియర్ కళాశాలలో దరఖాస్తులను ఇవ్వవచ్చని చెప్పారు. ఈ నెల 13 వ తేదీ లోపు దరఖాస్తులను పంపవచ్చని సూచించారు. ఎంట్రన్స్ 15న ఉదయము 11 నుండి 1 గంటవరకు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
- Advertisement -