Saturday, July 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కస్తూర్భాగాంధీ పాఠశాలలో దరఖాస్తుల ఆహ్వానం

కస్తూర్భాగాంధీ పాఠశాలలో దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -

పాఠశాల ప్రత్యేక అధికారి ఎం.భవాని
నవతెలంగాణ – మల్హర్ రావు

మండలంలోని దుబ్బపేట గ్రామపచాయితీ పరిధిలో ఉన్న కస్తూర్బా గాంధీ ఆశ్రమ పాఠశాలలో 2025-26 విద్యాసంవత్సరానికి గాను 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఖాళీగా ఉన్న సీట్లుకు దరఖాస్తుల ఆహ్వానం పలుకుతున్నట్లుగా పాఠశాల ప్రత్యేక అధికారి ఎం. భవాని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఇంటర్ ప్రథమ సంవత్సరానికి సిఈసి-30, ఎంపిహెచ్ డబ్ల్యూ-30 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఈ ఖాళీలకు స్పాట్ అడ్మిషన్లు ఇవ్వబడునని పేర్కొన్నారు.

పాఠశాలలో ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్,రోట్స్, ఏకారుప దుస్తులతో పాటు అర్హులైన ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్యా బోధన, రుచికర మైన భోజనం, మంచి ఫలితాలు, డిజిటల్ క్లాస్లులు, కంప్యూటర్ ల్యాబ్, పైన్ ల్యాబ్, లైబ్రరీ, ఆహ్లాదకరమైన వాతావరణం, విద్యార్థులకు, ఆటలు, పాటలు, యోగా, మార్షల్ ఆర్ట్స్ అన్ని రకాల సౌకర్యాలతో కలిగి ఉన్నాయన్నారు. పూర్తి వివరాలకు 8106613775 ఫోన్ నెంబర్ ను సంప్రధించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -