నవతెలంగాణ – ఆలేరు టౌను
2026, 27 విద్యా సంవత్సరని కి గాను, గురుకులాలలో ప్రవేశాలకు ఎస్సీ, ఎస్టీ ,బీసీ జనరల్ విద్యార్థులు జనవరి 21వ తేది సాయంత్రం 5 గంటల లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పరీక్ష రుసుము రూ.100 అని, బీసీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కె సురేఖ ఆలేరు పట్టణంలో బుధవారం విలేకరులకు ప్రకటనలో తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న, సాంఘిక, గిరిజన, వెనుకబడిన తరగతుల, జనరల్ గురుకుల విద్యాసంస్థలో (ఎస్సీ ఎస్ టి, బీసీ, జనరల్) 2026-2027 విద్యా సంవత్సరానికి ప్రవేశ పరీక్ష ప్రక్రియ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాంతీయ సమన్వయ అధికారిని (ఆర్ సి ఓ)ఈ స్వప్న ఆదేశాల మేరకు ఆలేరు నియోజకవర్గ పరిసర ప్రాంతాలలో విద్యార్థులకు ఇదొక సువర్ణ అవకాశం అని చెప్పారు.
5వ తరగతిలో ప్రవేశాలతో పాటు 6,7,8, 9 వ తరగతులలో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి అవకాశం ఉందని తెలిపారు. గురుకుల విద్యాలయాల్లో విద్య నైపుణ్యాలతో పాటు ఇంగ్లీష్ మీడియం విద్యా బోధన, ఉచిత వసతి, పౌష్టికాహారం,క్రీడల తదితర అంశాలలో నైపుణ్యం కల్పిస్తామని పేర్కొన్నారు. దరఖాస్తులు మీసేవ కేంద్రంలో, ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో గాని దరఖాస్తు చేసుకోవాలని, ప్రవేశ పరీక్ష తేదీ 22 ఫిబ్రవరి 2026 ఆదివారం రోజున ఉదయం 11 గంటల నుండి 1 గంటల వరకు నిర్వహించబడుతుందని ప్రిన్సిపల్ సురేఖ తెలియజేశారు.



