Tuesday, September 9, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్యువ ఆపదమిత్ర శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం

యువ ఆపదమిత్ర శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ,మేరా యువ భారత్ వారి ఆధ్వర్యంలో యువ ఆపదమిత్ర కార్యక్రమంలో భాగంగా సామాజిక స్పృహ కల్గిన యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లుగా జిల్లా యువ అధికారిని శైలి బెల్లాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమాజంలో వరదలు, కరువు, భూకంపాలు, క రోనా వంటి విపత్కర సమయంలో ఆపత్కాలంలో ఉన్నప్పుడు సహాయక చర్యలు చేపట్టడానికి భద్రతా దళాలకు అండగా ఉండటానికి యువతను సుశిక్షితులను చేసే ఒక అద్భుతమైన కార్యక్రమం ఇది అని వెల్లడించారు.

వారం రోజుల పాటు నిజామాబాద్ లేదా హైదరాబాద్ లో జరిగే ఈ శిక్షణ శిబిరం యొక్క అన్ని ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని, ఆపత్కాలంలో ఉపయోగకరంగా ఉండే ఒక ఎమర్జెన్సీ కిట్ తో పాటు, శిక్షణ పొంది నట్లు ప్రభుత్వ సర్టిఫికెట్ కూడా ఇస్తుందన్నారు. దరఖాస్తు చేసుకోవాల్సిన వారు..ప్రభుత్వం జారీచేసిన అడ్రెస్స్ ప్రూఫ్ లో నిజామాబాద్ జిల్లా కు చెందిన వారై ఉండాలి, వయస్సు 18 – 40 ఏళ్ల మధ్యలో ఉండాలి.  విద్యార్హత కనీసం 7 వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలి. దరఖాస్తుకు ఈ నెల 12 చివరి తేది.గ్రామాల్లోని యువత, విద్యార్థులు, యువజన సంఘాల సభ్యులు పెద్దఎత్తున నమోదు చేసుకోవాలని తెలిపారు. పూర్తి వివరాలకుఫోన్ 9100435410 నెంబర్ కు సంప్రదించాలన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad