- Advertisement -
నవతెలంగాణ -ముధోల్
అర్హులైన రైతులు రైతు బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ముధోల్ మండల వ్వవసాయ అధికారి రచన తెలిపారు. మండలంలోని జూన్ 5 వ తెది వరకు భూబారతిలో భూమి ఉన్న రైతులు రైతు బీమా కు అర్హులని పేర్కొన్నారు. రైతు తన ఆధార్ కార్డు, నామిని ఆధార్ కార్డు,రైతు భూమి పాస్ పుస్తకం జీరాక్స్ లతో స్వయంగా రైతు వచ్చి ఆయా రైతు వైదిక లో ఎఇఓ లకు రైతు బీమా దరఖాస్తులు ఇవ్వలని సూచించారు. ఈనెల 13వ తేది వరకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.మీగితా వివరాల కోరకు ఎఇఓ లను సంప్రదించాలని తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
- Advertisement -