Tuesday, October 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మంజూరైన ఇంటి నిర్మాణాలను త్వరితగతిన చేపట్టాలి: ఎంపీడీఓ

మంజూరైన ఇంటి నిర్మాణాలను త్వరితగతిన చేపట్టాలి: ఎంపీడీఓ

- Advertisement -

నవతెలంగాణ –  జుక్కల్
మండలంలోని గ్రామాలలో ఇందిరమ్మ గృహ పథకంలో మంజూరైన గృహ నిర్మాణ లబ్ధిదారులు నిర్మాణాలను త్వరిత గతిన చేపట్టాలని జుక్కల్ ఎంపిడిఓ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండలంలోని గుండూరు గ్రామాన్ని ఎంపీడీవో లబ్ధిదారుల ఇంటింటికి తిరిగుతు సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ.. మండలంలోని గ్రామాలలో ఇప్పటికే చాలామంది లబ్ధిదారులకు ఇందిరమ్మ పథకంలో గృహాలు మంజూరు అయినాయని అన్నారు. కొంతమంది లబ్ధిదారులు గృహ నిర్మాణాలు చేపట్టి పూర్తి చేశారని తెలిపారు. ఇంకొంతమంది గృహాలు నిర్మించుకోవడానికి మంజూరైన గృహ నిర్మాణాలు చేపట్టకపోవడం విచారకరంగా ఉందని తెలిపారు.

ప్రభుత్వం నుండి లబ్ధిదారులకు పూర్తిగా మద్దతు ఉంటుదని అన్నారు. గృహలు నిర్మించుకున్న వాటి లబ్ధిదారులకు గ్రీన్ ఛానల్ ద్వారా మూడు విడుతలుగా నేరుగా లబ్ధిదారుల ఖాతాలో ప్రభుత్వం డబ్బులు వేయడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే లబ్ధిదారులు గృహ నిర్మాణాల లబ్ది పొందారని సూచించారు. ఇప్పటికైనా లబ్ధిదారులు మంజూరైన గృహ నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. వాటికి మండల స్థాయి అధికారుల పూర్తి మద్దతు లబ్దిదారులకు ఉంటుందని, ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా కార్యాలయానికి వచ్చి తమతో విన్నవించుకోవచ్చని, సమస్యలు పరిష్కారం కొరకు తాము కృషి చేస్తామని లబ్ధిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవోతో పాటు జిపి కార్యదర్శి గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -